Posts

Showing posts from July, 2017

మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో నాని...!!!

Image
వరుస సూపర్ హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని నిన్ను కోరితో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నేచురల్ స్టార్ గా ఆకట్టుకుంటున్న నాని, మాస్ హీరోయిజం జోలికి పోకుండా ఆసక్తికరమైన కథలతో అలరిస్తున్నాడు. ఇప్పటికే మల్టీప్లెక్స్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు అన్ని వర్గాలను అలరించే పనిలో ఉన్నాడు. అందుకే మల్టీ స్టారర్ సినిమాలకు ఓటేస్తున్నాడు. రైడ్, ఎవడే సుబ్రమణ్యం, నిన్నుకోరి సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి నటించినా.. సీనియర్ హీరోతో మాత్రం ఇంత వరకు మల్టీ స్టారర్ సినిమా చేయలేదు. తాజా సమాచారం ప్రకారం.. నాని, సీనియర్ హీరో నాగ్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడట. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్నా.. నాగ్ నుంచి గాని, నాని నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ప్రస్తుతం నాని చేతులో మూడు సినిమాలు ఉన్నాయి. నాగ్ కూడా సెట్స్ మీద ఉన్న రాజుగారి గదిలో పాటు మరో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయితేగాని ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. source from :  http://www.sakshi.com/cinema

పవర్ స్టార్ క్రేజ్ ను వాడుకొంటున్న శేఖర్ కమ్ముల

Image
 శేఖర్ కమ్ముల   కొత్త చిత్రం ఫిదా రేపు రిలీజ్ కానుంది . ఇందులో వరుణ్ తేజ్ హీరో గ  , సాయి పల్లవి హీరోయిన్ గ నటించనున్నారు . ఈ సినిమా లో హీరోయిన్ సాయి పల్లవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని గ నటిస్తుందని హీరో వరుణ్ తేజ్ ఒక  ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది . సాయి పల్లవి ఇందులో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్తూ అయన మేనరిజాన్ని కూడా కాపీ చేసిందని వరుణ్ తేజ్ చెప్పాడు . ఇలా చెప్పడం తో ఒక్క సారిగా ఈ సినిమా క్రేజ్ పెరిగిందని సమాచారం. పవర్ స్టార్ క్రేజ్ ను ఇలా ప్రతి ఒక్కరు వాడుకొంటునడం తో పవన్ కళ్యాణ్ నే టాలీవుడ్ నెంబర్ . 1 అని మరోసారి రుజువుయింది . 

చరణ్ కోసం ఓ భారీ సెట్... !!!

Image
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం 1985 సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే . సుకుమార్ దర్శకత్వం లో పీరియాడిక్ లవ్ స్టోరీ గ తెరకెక్కువుతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే . ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి నది , పల్లెటూరికి సంబంధించిన కొన్ని సీన్స్ షూట్  చేసారు . త్వరలో మరో భారీ షెడ్యూల్ కు  రెడీ అవుతున్నారు .  తదుపరి షెడ్యూల్ కోసం 5 కోట్లతో భారీ సెట్ ను రూపొందిస్తున్నారు . 1980 నాటి వాతావరణం కనిపించేలా ఓ గ్రామాన్ని ఆర్టిఫిసియల్ గా నిర్మిస్తున్నారు . దాదాపు 35 రోజుల పాటు ఈ సెట్ లోనే షూటింగ్ జరగనుంది . చరణ్ తో పాటు కీలక పాత్రల్లో నటిస్తున్న హీరోయిన్ సమంత , ఆది పినిశెట్టి , జగపతిబాబు , అనసూయ ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు . 

Breaking News: పూరి జగన్నాథ్ తో ప్రారంభం కానున్న డ్రగ్స్ కేసు విచారణ ... !!!

Image
నోటీసులతో సంచనలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు ఇపుడు విచారణ చేయడానికి సిద్ధం అవుతుంది ,ఈ కేసు లో మొదటగా పూరి జగన్నాథ్ ను విచారించనున్నారు ఆ తర్వాత రోజుకి ఒకరి చొప్పున్న విచారణ జరపనున్నట్లు  ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ తెలిపారు .  విచారించనున్న తేదీలు ఇలా ఉన్నాయి : 1. పూరి జగన్నాథ్ (19-07-2017) 2. ఛార్మి (20-07-2017) 3. ముమైత్ ఖాన్ (21-07-2017) 4. సుబ్బరాజు (22-07-2017) 5. శ్యామ్ కె నాయుడు (23-07-2017) 6. రవితేజ (24-07-2017) 7. ఆర్ట్ డైరెక్టర్ చిన్న (25-07-2017) 8. నవదీప్ (26-07-2017) 9. తరుణ్ (27-07-2017) 10.  తనీష్ , నందు (28-07-217)

ఉప రాష్ట్రపతి గ తెలుగు వ్యక్తి ...!!!

Image
భారత దేశ ఉప రాష్ట్రపతి గ బీజేపీ పార్టీ తరుపున ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు నామినేషన్ వేయనున్నట్లు ఇప్పుడే తెలిసింది . తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి  కి ఉన్నతమైన పదవి  లభిస్తునందుకు ఈ వార్త ప్రతి ఒక్క తెలుగు వారికి గర్వకారణం . వెంకయ్య నాయుడు గారు ప్రస్తుతం కేంద్ర  మంత్రి గా , రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు ,ఈ పదవులకు ఈ రోజే రాజీనామా చేయనున్నారని సమాచారం . వెంకయ్య నాయుడు గారు 1 జులై 1949 న నెల్లూరు జిల్లా లో జన్మిచారు , ఆ తర్వాత ఆయన మొదటి సారిగ 1978 లో ఎమ్మెల్యే గ ఆయన తన ప్రస్థానం ఆరంభించి  తర్వాత 4 సార్లు రాజ్యసభ సభ్యుడిగా 3 సార్లు కేంద్రమంత్రి గ పనిచేశారు , రేపు  ఉప రాష్ట్రపతి గ నామినేషన్ వేయనున్నారు ఆయన గెలుపు లాంఛనమనేదని అందరికి తెలిసిందే .

ఓ వింత గుహ - పంచతంత్ర కథలు | SlateKids 3D Animated Video

Image
                                         The Panchatantra is an ancient Indian collection of interrelated animal fables  in verse and prose, arranged within a frame story. The original Sanskrit work,  which some scholars believe was composed around the 3rd century BCE, is  attributed to Vishnu Sharma. It is based on older oral traditions, including  "animal fables that are as old as we are able to imagine". The Panchatantra is a series of inter-woven fables, many of which involve  animals exhibiting animal stereotypes. According to its own narrative, it  illustrates, for the benefit of three ignorant princes, the central Hindu  principles of nīti. While nīti is hard to translate, it roughly means prudent  worldly conduct, or "the wise conduct of life". 'The talking Cave' Long ago,in a jungle there lived an lion named Vi...

మరోసారి పాడనున్న పవన్ కళ్యాణ్...!!!

Image
 అవును మీరు చూస్తున్నది నిజమే ,అభిమానుల కోసం మరోసారి పాడనున్న పవన్ కళ్యాణ్ . అత్తారింటికి దారేది లో " కాటమ  రాయుడా  కదిరి  నరసింహుడా " అంటూ పాడి  సెన్సేషన్ క్రీయేట్ చేసాడు అలాగే ఆ సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ క్రీయేట్ చేసింది .అదే సెంటిమెంట్ తో ఇపుడు  కూడా ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ సింగర్ అవతారం ఎత్తనున్నాడు . పవన్ తో ఎలాగైనా పాడించాలని దర్శకుడు త్రివిక్రమ్ ,మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్  టాక్ . అనుకున్నదే తడువుగా పవన్ ను అడిగారని అందుకు అయన సుముఖంగానే ఉన్నారని సమాచారం . పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం తో చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు కూడా ఖుషి గ ఉన్నారు . చూడాలి ఈ సినిమా కూడా టాలీవుడ్  ఇండస్ట్రీ రికార్డ్స్  క్రీయేట్ చేస్తుందో  లేదో ...

Drug Case :List of Tollywood celebratess names...!!!

Image
తెలుగు సినీ పరిశ్రమ లో ఇపుడు ప్రకంపనలు పుట్టిస్తున్న వార్త డ్రగ్స్ కేసు . ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసు లు అందుకున్న లిస్ట్ రోజు రోజుకి పెరుగుతుంది ,ఇప్పటి దాకా నోటీసు లు అందుకున్న లిస్ట్ ను ఒక సారి పరిశీలిస్తే అందులో చాల మంది ప్రముఖ సెలెబ్రేటిస్ ఉండడం ఇపుడు చర్చనీయాంశం అయింది . వీరందరూ విచారణ కు సహకరించాలని లేకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని   ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ మీడియా కు వెల్లడించారు.  నోటీసు లు అందుకున్న టాలీవుడ్ సెలెబ్రేటిస్ వీళ్ళే : 1. రవితేజ  2. పూరి జగన్నాధ్  3. ఛార్మి  4. తరుణ్  5. ముమైత్ ఖాన్  6. నవదీప్  7. సుబ్బరాజు  8. ఆర్ట్ డైరెక్టర్ చిన్న  9. కెమెరా మ్యాన్ శ్యామ్ కె . నాయుడు  10. గీతామాధురి భర్త నందు  11. తనీష్ 

దర్శకుడికి అతిథి...!!!

Image
‘కుమారి 21ఎఫ్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌ నిర్మాతగా రూపొందుతోన్న వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘ దర్శకుడు ’. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటలను రేపు (శనివారం) విడుదల చేస్తున్నారు. ఈ వేడుకకు రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్‌ కుదిరింది. అందుకే ‘దర్శకుడు’కి అతిథి కావడానికి చరణ్‌ అంగీకరించి ఉంటారు. Sorce From :  http://www.sakshi.com/cinema

చిరు మూవీ డేట్ ఫిక్స్...!!!

Image
మెగా అభిమానులు ,సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా  అని ఎంతో కాలం గ వేచి చూస్తున్న మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న  సినిమా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి . ఈ సినిమా ఒక చారిత్రాత్మకమైన సినిమా ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళను ఎదిరించిన మొట్ట మొదటి స్వాతంత్ర సమరయోధుని గొప్ప చరిత్ర ఇందులో తెరకేకించనున్నారు .  ఈ సినిమా ను మొదట చిరు బర్త్డే ఆగస్టు 22 న ప్రారంభించాలి అని అనుకొన్నారు కానీ ఈ సినిమా ను ఆగష్టు 15 ఇండిపెండెన్స్  రోజున ప్రారంభించనున్నారు . ఈ మూవీ ని వేసవి లో ఇండియా వైస్  రిలీజ్ చెయ్యాలని అనుకొంటున్నారు .  ప్రస్తుతం చిరంజీవి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు ఆలోగా ఈ సినిమా స్క్రిప్ట్ , మాటలు ,ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి ఆగష్టు 15 న స్టార్ట్ చేయనున్నారు. 

మల్టీ స్టారర్ చేయనున్న రామ్ చరణ్???

Image
ఈ మధ్యన అన్ని వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఇండియన్ మూవీ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారి తో సినిమా  చేయనున్నారని సమాచారం  , ఆ మూవీ ఒక మల్టీ స్టారర్ అని టాక్.ఇందులో రామ్ చరణ్ తో పాటు బెంగళూరు డేస్ ఫేమ్  సల్మాన్ దుల్కర్ ,ఫహద్ ఫాసిల్ నటించనున్నారు . ఈ సినిమా ను త్వరలోనే తెలుగు , తమిళ్ ,హిందీ భాషలలో చిత్రీకరిస్తారని సమాచారం . ఈ ప్రెస్టీజియస్ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు .  మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన తో పాటు కొత్తదనం సినిమా లు కోరుకునేవాళ్లలో మొదటి స్థానం లో ఉండటం మెగా అభిమానులు ఎంతో గర్విస్తున్నారు . 

సంక్రాంతి బరిలో పవర్ స్టార్ సోలో?

Image
ఈ సారి సంక్రాంతి హాట్ గా వుంటుందని, మహేష్, పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్, బాలయ్య బాబుల సినిమాలు సందడి చేస్తాయని అనేసుకున్నారు అంతా. కానీ ఇప్పుడు అంత సీన్ ఏమీ వుండకపోవచ్చని తెలుస్తోంది. అన్నింటికన్నా కీలకంగా మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సుకుమార్-రామ్ చరణ్ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చని టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతికి పక్కా కావడంతో, రామ్ చరణ్ తప్పుకోక తప్పడం లేదని తెలుస్తోంది. దానికి తోడు ఆ సినిమాకు ఇంకా చాలా వర్క్ వున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు-కొరటాల శివ సినిమా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. సెప్టెంబర్ నెల అంతా మహేష్ స్పైడర్ ప్రమోషన్లపై బిజీగా వుంటారు. అంటే ఆగస్టు, అక్టోబర్ నవంబర్, డిసెంబర్ నాలుగు నెలల్లో సినిమా ఫినిష్ చేయడం అంటే అంత సులువు కాదు. బాలయ్య-రవికుమార్ సినిమా ఇంకా స్టార్టే కాలేదు. అందువల్ల అది కూడా సంక్రాంతి బరిలోకి వస్తుందని అనుకోవడానికి లేదు. ఇక ఎప్పుడూ సంక్రాంతి బరిలోకి వచ్చే నాగ్ చేతిలో ఒక్క సినిమా వుంది. అది ఈ లోగానే విడుదలైపోతుంది. సో, టాప్ హీరోల సినిమాలు ఏవీ పవన్-త్రివిక్రమ్ సినిమాకు పోటీగ...

మహేష్ బాబు కొత్త మూవీ డైరెక్టర్ ఎవరు???

Image
సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నాడనే వార్త ఇపుడు హాట్ టాపిక్ అయింది .అతడు , ఖలేజా తరువాత త్రివిక్రమ్ తో చేయబోయే  ఈ సినిమా ను 2018 లో ప్రారంభించనున్నారు . ఇది వరకే మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలిసి పనిచేయడానికి ఎప్పుడైనా  డేట్స్ ను కేటాయిస్తానని ప్రకటించాడు . ఈ వార్త తెలిసి సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆతృత గ చూస్తున్నారు  . ఇంకా ఆఫిసిఅల్ గ అనౌన్స్ చేయలేదు కానీ  తప్పకుండా ఈ మూవీ ఉంటుందని దానికి సంబంధించి న వివరాలు త్వరలోనే  తెలియచేయనున్నారని ఫిలిం నగర్ వర్గాల టాక్.

చరణ్ సినిమాపై బిగ్ ఎనౌన్స్ మెంట్..!

Image
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాడు. గతంలో పూజ కార్యక్రమాల తరువాత ఆగిపోయిన సినిమాను తిరిగి తెర మీదకు తీసుకువస్తున్నారు. సుకుమార్ సినిమా కన్నా ముందే రామ్ చరణ్, కొరటాల శివ ల కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైంది. అయితే ఆ సినిమాను పక్కన పెట్టేసిన చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాడు. కానీ కొరటాల శివ సినిమా ఎందుకు ఆగిపోయిందన్న విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా మరోసారి కొరటాల శివతో రామ్ చరణ్ సినిమా అంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా తన కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. 2018 వేసవి షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. మరి గతంలో ఓకె అనుకున్న కథతోనే ఈ సినిమా చేస్తున్నారా.. లేక చెర్రీ కోసం కొరటాల కొత్త కథను రెడీ చేశాడా తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. Source From: http://www.sakshi.com/cinema

పవన్ క్లాస్ పీకింది కమెడియన్ ప్రవీణ్‌కేనట!

Image
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూట్ గ్యాప్ లో తన వద్దకు వచ్చి జనసేన విధివిధానాలు అసందర్భంగా ప్రశ్నించిన ఓ కమెడియన్‌పై పవన్ కల్యాణ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారన్న వార్త సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైలర్ అయ్యింది. అయితే ఈ వార్తను లీక్ చేసిన వారు ఆ కమెడియన్ పేరును తెలుపకుండా, ‘అ..ఆ’ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన కమెడియన్ అంటూ ఓ హింట్ ఇచ్చి వదిలారు. దీంతో, ఆ నటుడు కమెడియన్ ప్రవీణేనని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అ..ఆ’ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేసింది ప్రవీణే.. హీరో ఇంట్లో సర్వెంట్‌గా అతడు సినిమా మొత్తం కనపడతాడు. దీంతో, పవన్ తిట్టింది ప్రవీణేనని ఇప్పుడు మరో హాట్ న్యూస్ సర్య్యులేట్ అవుతుంది.. అయితే దీనిపై చిత్ర వర్గాలు కానీ లేదా ప్రవీణ్ కానీ ఇప్పటిదాకా స్పందించలేదు.

రాజుగారి గదిలోకి కాజల్

Image
చిన్న చిత్రంగా విడుదలైన ‘ రాజు గారి గది ” సినిమా ఘన విజయం అందుకుంది . ఆ సినిమాకి సీక్వెల్ గా “ రాజు గారి గది 2 ” తీస్తున్నారు. కింగ్ నాగార్జున ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్ లు నటిస్తున్నారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త బయటకి వచ్చింది .. వ‌రుస సినిమాల‌తో జోరు పెంచిన గ్లామ‌ర్ క్వీన్ కాజ‌ల్ ఈ చిత్రంలో నటించబోతున్నాడనేది ఆ వార్త …ఈ మూవీలో న‌టించాల్సిందిగా నాగార్జున ఈ హీరోయిన్ ను కోరిన‌ట్లు స‌మాచారం. ఈ మూవీ కోసం త‌న ప‌ది రోజుల కాల్షీట్ కూడా కేటాయించిందట . వెన్నెల కిషోర్, ప్ర‌వీణ్‌, అశ్విన్ కూడా ఇందులో నటిస్తున్నారు ..కాజల్ రాకతో ఈ చిత్రంపై అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు ..మొత్తానికి చిన్న సినిమాగా వచ్చిన రాజు గారి గది ఇప్పుడు పెద్ద చిత్రంగా అలరించబోతున్నది.

పవన్-త్రివిక్రమ్‌ల సినిమా ఆ విధంగా అందరికీ షాక్ ఇచ్చింది!

Image
పవన్ కల్యాణ్‌- త్రివిక్రమ్ ల కాంబినేషన్ టాలీవుడ్‌ లోనే మోస్ట్ క్రేజీయస్ట్ కాంబినేషన్‌! వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు మంచి విజయాలు సాధించడమే దీనికి కారణం! ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతుంది. పవన్ కల్యాణ్ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసుకుంది. తాజాగా, ఈసినిమా శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యి టాలీవుడ్ ను షాక్‌ కు గురి చేశాయి. ఈ సినిమా టీవీ టెలికాస్ట్ రైట్స్ ను జెమినీ ఛానల్‌ ఏకంగా 19.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రెగ్యులర్ కమర్షియల్‌ సినిమాకు ఇంత భారీ స్థాయిలో శాటిలైట్ ధర పలకడం పట్ల టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు గల క్రేజ్‌.. దర్శకుడిగా త్రివిక్రమ్ కు ఉన్న ఇమేజే ఈ స్థాయిలో శాటిలైట్ రేట్ రావడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజమౌళిని ఆ బడా తమిళ నిర్మాత అందుకే కలిశాడా?

Image
కేవలం తన సినిమాలతోనే కాదు.. తన వ్యక్తిత్వంతో కూడా అందరినీ అకట్టుకుంటారు రాజమౌళి! ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం ఆయనది! బాహుబలి తర్వాత ఆయన కు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు ఇతర భాషా నిర్మాతలు కూడా పోటీపడుతున్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం 2.0 ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ అధినేత రాజు మహాలింగం తాజాగా రాజమౌళిని హైదరాబాద్‌లో కలిశారు. ఈ మీటింగ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. దర్శకుడిగా శిఖర స్థాయిని అందుకున్న రాజమౌళి అంతటి వినయ విధేయతలు కలిగి నిగర్విగా ఉండటం తనకి ఆశ్యర్యం కలిగిందని అన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంతోగొప్పదంటూ ఆయన ప్రశంసించారు.  అయితే ఇంత హఠాత్తుగా రోబో సీక్వెల్ నిర్మాత రాజమౌళిని కలవడం చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం తీయడానికి రామలింగం జక్కన్నను కలిశారని ఫిలింనగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

నా స్టామినా 150 కోట్లు బ్రదర్..

Image
సరైనోడు తర్వాత అల్లు అర్జున్ నటించిన డీజే టాక్ ఎలా ఉన్నా ,బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది ..తొలివారంలోనే 100 కోట్ల షేర్ సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు ..ఇక రెండోవారంలోను ఈ చిత్ర జోరు ఇలానే సాగుతుందని మేకర్స్ భావిస్తున్నారు ..ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం , విడుదలయిన మూడు చిన్న చిత్రాలు నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులకి డీజే నే అప్షన్ కాబోతుంది ..ఇక 7 న నాని ,నిన్నుకోరి వచ్చేవరకు డీజే హవా ఉంటుందంటున్నారు ..పైగా రెండోవారంలోను థియేటర్లలో పెద్దగా మార్పు లేకపోవడం మరో ప్లేస్ గా భావిస్తున్నారు ..కాబట్టి 150 కోట్ల గ్రాస్ పెద్దకష్టమేమీకాదని అనుకుంటున్నారు ..ఇదే జరిగితే నాన్ బాహుబలి చిత్రాలలో ఖైదీ 150 తర్వాతి ప్లేస్ కి చేరుతుంది ..డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ స్థాయి కలెక్షన్స్ రావటం విమర్శకులని సైతం ఆశ్చర్యపరుస్తుంది ..మొత్తానికి బన్నీ నా స్టామినా 150 కోట్లు బ్రదర్ అనేట్లే ఉన్నాడు ..