చరణ్ సినిమాపై బిగ్ ఎనౌన్స్ మెంట్..!
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాడు. గతంలో పూజ కార్యక్రమాల తరువాత ఆగిపోయిన సినిమాను తిరిగి తెర మీదకు తీసుకువస్తున్నారు. సుకుమార్ సినిమా కన్నా ముందే రామ్ చరణ్, కొరటాల శివ ల కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైంది. అయితే ఆ సినిమాను పక్కన పెట్టేసిన చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాడు.
కానీ కొరటాల శివ సినిమా ఎందుకు ఆగిపోయిందన్న విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా మరోసారి కొరటాల శివతో రామ్ చరణ్ సినిమా అంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా తన కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. 2018 వేసవి షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. మరి గతంలో ఓకె అనుకున్న కథతోనే ఈ సినిమా చేస్తున్నారా.. లేక చెర్రీ కోసం కొరటాల కొత్త కథను రెడీ చేశాడా తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Source From:http://www.sakshi.com/cinema
Megapower star cherry.
ReplyDelete