పవన్-త్రివిక్రమ్‌ల సినిమా ఆ విధంగా అందరికీ షాక్ ఇచ్చింది!


పవన్ కల్యాణ్‌- త్రివిక్రమ్ ల కాంబినేషన్ టాలీవుడ్‌లోనే మోస్ట్ క్రేజీయస్ట్ కాంబినేషన్‌! వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు మంచి విజయాలు సాధించడమే దీనికి కారణం! ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతుంది. పవన్ కల్యాణ్ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసుకుంది. తాజాగా, ఈసినిమా శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యి టాలీవుడ్ ను షాక్‌ కు గురి చేశాయి. ఈ సినిమా టీవీ టెలికాస్ట్ రైట్స్ ను జెమినీ ఛానల్‌ ఏకంగా 19.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రెగ్యులర్ కమర్షియల్‌ సినిమాకు ఇంత భారీ స్థాయిలో శాటిలైట్ ధర పలకడం పట్ల టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు గల క్రేజ్‌.. దర్శకుడిగా త్రివిక్రమ్ కు ఉన్న ఇమేజే ఈ స్థాయిలో శాటిలైట్ రేట్ రావడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

Post a Comment

Popular posts from this blog

Cricket vs Formers???

దర్శకుడికి అతిథి...!!!