ఉప రాష్ట్రపతి గ తెలుగు వ్యక్తి ...!!!
భారత దేశ ఉప రాష్ట్రపతి గ బీజేపీ పార్టీ తరుపున ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు నామినేషన్ వేయనున్నట్లు ఇప్పుడే తెలిసింది . తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కి ఉన్నతమైన పదవి లభిస్తునందుకు ఈ వార్త ప్రతి ఒక్క తెలుగు వారికి గర్వకారణం .
వెంకయ్య నాయుడు గారు ప్రస్తుతం కేంద్ర మంత్రి గా , రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు ,ఈ పదవులకు ఈ రోజే రాజీనామా చేయనున్నారని సమాచారం .
వెంకయ్య నాయుడు గారు 1 జులై 1949 న నెల్లూరు జిల్లా లో జన్మిచారు , ఆ తర్వాత ఆయన మొదటి సారిగ 1978 లో ఎమ్మెల్యే గ ఆయన తన ప్రస్థానం ఆరంభించి తర్వాత 4 సార్లు రాజ్యసభ సభ్యుడిగా 3 సార్లు కేంద్రమంత్రి గ పనిచేశారు , రేపు ఉప రాష్ట్రపతి గ నామినేషన్ వేయనున్నారు ఆయన గెలుపు లాంఛనమనేదని అందరికి తెలిసిందే .
Comments
Post a Comment