దర్శకుడికి అతిథి...!!!
‘కుమారి 21ఎఫ్’ వంటి హిట్ చిత్రం తర్వాత క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా రూపొందుతోన్న వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘దర్శకుడు’. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటలను రేపు (శనివారం) విడుదల చేస్తున్నారు.
ఈ వేడుకకు రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం రామ్‌చరణ్ ‘రంగస్థలం’ చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. అందుకే ‘దర్శకుడు’కి అతిథి కావడానికి చరణ్ అంగీకరించి ఉంటారు.
Sorce From : http://www.sakshi.com/cinema
Comments
Post a Comment