సంక్రాంతి బరిలో పవర్ స్టార్ సోలో?
ఈ సారి సంక్రాంతి హాట్ గా వుంటుందని, మహేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, బాలయ్య బాబుల సినిమాలు సందడి చేస్తాయని అనేసుకున్నారు అంతా. కానీ ఇప్పుడు అంత సీన్ ఏమీ వుండకపోవచ్చని తెలుస్తోంది.
అన్నింటికన్నా కీలకంగా మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సుకుమార్-రామ్ చరణ్ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చని టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతికి పక్కా కావడంతో, రామ్ చరణ్ తప్పుకోక తప్పడం లేదని తెలుస్తోంది. దానికి తోడు ఆ సినిమాకు ఇంకా చాలా వర్క్ వున్నట్లు తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు-కొరటాల శివ సినిమా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. సెప్టెంబర్ నెల అంతా మహేష్ స్పైడర్ ప్రమోషన్లపై బిజీగా వుంటారు. అంటే ఆగస్టు, అక్టోబర్ నవంబర్, డిసెంబర్ నాలుగు నెలల్లో సినిమా ఫినిష్ చేయడం అంటే అంత సులువు కాదు.
బాలయ్య-రవికుమార్ సినిమా ఇంకా స్టార్టే కాలేదు. అందువల్ల అది కూడా సంక్రాంతి బరిలోకి వస్తుందని అనుకోవడానికి లేదు. ఇక ఎప్పుడూ సంక్రాంతి బరిలోకి వచ్చే నాగ్ చేతిలో ఒక్క సినిమా వుంది. అది ఈ లోగానే విడుదలైపోతుంది.
సో, టాప్ హీరోల సినిమాలు ఏవీ పవన్-త్రివిక్రమ్ సినిమాకు పోటీగా సంక్రాంతి బరిలోకి దిగేంత సీన్ లేదని తెలుస్తోంది.
త్రివిక్రమ్-పవన్ సినిమా అన్నీ కలుపుకుని 125కోట్ల మేరకు బిజినెస్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఆ రేంజ్ సినిమా సంక్రాంతికి సోలోగా వస్తుందంటే బయ్యర్లకు పండగే పండగ.
Source From : http://telugu.greatandhra.com
Comments
Post a Comment