రాజుగారి గదిలోకి కాజల్
చిన్న చిత్రంగా విడుదలైన ‘రాజు గారి గది” సినిమా ఘన విజయం అందుకుంది . ఆ సినిమాకి సీక్వెల్ గా “రాజు గారి గది 2” తీస్తున్నారు. కింగ్ నాగార్జున ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్ లు నటిస్తున్నారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త బయటకి వచ్చింది .. వరుస సినిమాలతో జోరు పెంచిన గ్లామర్ క్వీన్ కాజల్ ఈ చిత్రంలో నటించబోతున్నాడనేది ఆ వార్త …ఈ మూవీలో నటించాల్సిందిగా నాగార్జున ఈ హీరోయిన్ ను కోరినట్లు సమాచారం. ఈ మూవీ కోసం తన పది రోజుల కాల్షీట్ కూడా కేటాయించిందట . వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్ కూడా ఇందులో నటిస్తున్నారు ..కాజల్ రాకతో ఈ చిత్రంపై అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు ..మొత్తానికి చిన్న సినిమాగా వచ్చిన రాజు గారి గది ఇప్పుడు పెద్ద చిత్రంగా అలరించబోతున్నది.
Comments
Post a Comment