నా స్టామినా 150 కోట్లు బ్రదర్..


సరైనోడు తర్వాత అల్లు అర్జున్ నటించిన డీజే టాక్ ఎలా ఉన్నా ,బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది ..తొలివారంలోనే 100 కోట్ల షేర్ సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు ..ఇక రెండోవారంలోను ఈ చిత్ర జోరు ఇలానే సాగుతుందని మేకర్స్ భావిస్తున్నారు ..ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం , విడుదలయిన మూడు చిన్న చిత్రాలు నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులకి డీజే నే అప్షన్ కాబోతుంది ..ఇక 7 న నాని ,నిన్నుకోరి వచ్చేవరకు డీజే హవా ఉంటుందంటున్నారు ..పైగా రెండోవారంలోను థియేటర్లలో పెద్దగా మార్పు లేకపోవడం మరో ప్లేస్ గా భావిస్తున్నారు ..కాబట్టి 150 కోట్ల గ్రాస్ పెద్దకష్టమేమీకాదని అనుకుంటున్నారు ..ఇదే జరిగితే నాన్ బాహుబలి చిత్రాలలో ఖైదీ 150 తర్వాతి ప్లేస్ కి చేరుతుంది ..డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ స్థాయి కలెక్షన్స్ రావటం విమర్శకులని సైతం ఆశ్చర్యపరుస్తుంది ..మొత్తానికి బన్నీ నా స్టామినా 150 కోట్లు బ్రదర్ అనేట్లే ఉన్నాడు ..

Comments

Popular posts from this blog

Cricket vs Formers???

పవన్-త్రివిక్రమ్‌ల సినిమా ఆ విధంగా అందరికీ షాక్ ఇచ్చింది!

దర్శకుడికి అతిథి...!!!