చరణ్ కోసం ఓ భారీ సెట్... !!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం 1985 సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే . సుకుమార్ దర్శకత్వం లో పీరియాడిక్ లవ్ స్టోరీ గ తెరకెక్కువుతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే . ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి నది , పల్లెటూరికి సంబంధించిన కొన్ని సీన్స్ షూట్ చేసారు . త్వరలో మరో భారీ షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు .
తదుపరి షెడ్యూల్ కోసం 5 కోట్లతో భారీ సెట్ ను రూపొందిస్తున్నారు . 1980 నాటి వాతావరణం కనిపించేలా ఓ గ్రామాన్ని ఆర్టిఫిసియల్ గా నిర్మిస్తున్నారు . దాదాపు 35 రోజుల పాటు ఈ సెట్ లోనే షూటింగ్ జరగనుంది . చరణ్ తో పాటు కీలక పాత్రల్లో నటిస్తున్న హీరోయిన్ సమంత , ఆది పినిశెట్టి , జగపతిబాబు , అనసూయ ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు .
Comments
Post a Comment