రాజమౌళిని ఆ బడా తమిళ నిర్మాత అందుకే కలిశాడా?
కేవలం తన సినిమాలతోనే కాదు.. తన వ్యక్తిత్వంతో కూడా అందరినీ అకట్టుకుంటారు రాజమౌళి! ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం ఆయనది! బాహుబలి తర్వాత ఆయన కు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు ఇతర భాషా నిర్మాతలు కూడా పోటీపడుతున్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 2.0 ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ అధినేత రాజు మహాలింగం తాజాగా రాజమౌళిని హైదరాబాద్‌లో కలిశారు. ఈ మీటింగ్ అనంతరం ఆయన మాట్లాడుతూ..
దర్శకుడిగా శిఖర స్థాయిని అందుకున్న రాజమౌళి అంతటి వినయ విధేయతలు కలిగి నిగర్విగా ఉండటం తనకి ఆశ్యర్యం కలిగిందని అన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంతోగొప్పదంటూ ఆయన ప్రశంసించారు. అయితే ఇంత హఠాత్తుగా రోబో సీక్వెల్ నిర్మాత రాజమౌళిని కలవడం చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం తీయడానికి రామలింగం జక్కన్నను కలిశారని ఫిలింనగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Post a Comment