పవన్ క్లాస్ పీకింది కమెడియన్ ప్రవీణ్‌కేనట!
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూట్ గ్యాప్ లో తన వద్దకు వచ్చి జనసేన విధివిధానాలు అసందర్భంగా ప్రశ్నించిన ఓ కమెడియన్‌పై పవన్ కల్యాణ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారన్న వార్త సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైలర్ అయ్యింది. అయితే ఈ వార్తను లీక్ చేసిన వారు ఆ కమెడియన్ పేరును తెలుపకుండా, ‘అ..ఆ’ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన కమెడియన్ అంటూ ఓ హింట్ ఇచ్చి వదిలారు. దీంతో, ఆ నటుడు కమెడియన్ ప్రవీణేనని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అ..ఆ’ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేసింది ప్రవీణే.. హీరో ఇంట్లో సర్వెంట్‌గా అతడు సినిమా మొత్తం కనపడతాడు. దీంతో, పవన్ తిట్టింది ప్రవీణేనని ఇప్పుడు మరో హాట్ న్యూస్ సర్య్యులేట్ అవుతుంది.. అయితే దీనిపై చిత్ర వర్గాలు కానీ లేదా ప్రవీణ్ కానీ ఇప్పటిదాకా స్పందించలేదు.
Comments
Post a Comment