ప్రజా సంకల్పం పాదయాత్ర Day – 5 సమగ్ర సమాచారం..
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల సమీపంలోని బస నుంచి ఐదోరోజు పాదయాత్ర ప్రారంభిచాడు. ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభం కాగా , జగన్‌తో కలిసి వందల సంఖ్యలో యువత అడుగు కలిపింది. రాజన్న రాజ్యం.. జగనన్న లక్ష్యం అంటూ యువత పాదయాత్రలో పాల్గొంది. వైఎస్ జగన్‌ను చూసేందుకు, అభిమానులు పోటీపడ్డారు . అందరినీ పలకరిస్తూ.. క్షేమ సమాచారాలు ఆరా తీస్తూ.. వైఎస్ జగన్ ముందుకు సాగాడు . పాదయాత్ర సందర్భంగా రోడ్డుకిరువైపులా జనాలు జగన్ కోసం ఎదరు చూస్తూ నిలబడ్డారు. ఎర్రగుంట్ల నుంచి బయలుదేరి పదకొండు గంటలకు పోట్లదుర్తి గ్రామానికి చేరుకున్న వైఎస్ జగన్‌కు ప్రజలు, అభిమానులు, ఘనస్వాగతం పలికారు. పోట్లదుర్తి చేరుకున్న తరువాత వైఎస్ జగన్ అక్కడే పార్టీ జెండాను అవిష్కరించాడు. ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను వాల్మీకి బోయలు పోట్లదుర్తిలో కలిసి తమ ఆవేదనను ఆయనకు చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు ద్రోహం చేస్తున్నాడని.. మీరే న్యాయం చేయాలంటూ వైఎస్ జగన్‌ను వేడుకున్నారు.
Comments
Post a Comment