అప్పుడే కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న ముద్దుగుమ్మ!

‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్‌కు అరంగేట్రం చేసిన పూజా హెగ్డే  ఆ తర్వాత నాగచైతన్య సరసస ‘ఒక లైలా కోసం’ లో కూడా నటించింది. అయితే, ఈ రెండు సినిమాలు ఆమె టాలీవుడ్‌లో బ్రేక్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏకంగా హృతిక్ రోషన్ సరసన ‘మొహంజోదారో’ సినిమాలో అవకాశం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ లో ఆమెకు ఆశించిన అవకాశాలు రాలేదు. మళ్లీ ఇప్పుడు  టాలీవుడ్ పై దృష్టి పెట్టి  దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తోంది. ఈ సినిమా హిట్ అవుతుందనే వార్తలు వస్తుండటంతో.. పూజా హెగ్డే కు టాలీవుడ్‌ చాలా మంది అగ్ర నిర్మాతలు సంప్రదిస్తున్నారు. దీంతో ఈ డిమాండ్ ను క్యాష్‌ చేసుకునేందుకు ఆమె ఒక్కసారిగా తన పారితోషకాన్ని పెంచేసిందట. నిన్న మొన్నటి దాకా ముఫ్పై- నలభై లక్షల రేంజ్ లో ఉన్న ఈ భామ ఇప్పుడు తన రేటు కోటి చెబుతుందట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పూజా హెగ్డేను సంప్రదించగా ఆమె కోటి రూపాయలు అడిగాడట. ఆమె అడిగినంత ఇవ్వడానికి బెల్లంకొండ సురేష్ సిద్ధపడ్డాడని చెప్పుకుంటున్నారు.

Comments

Popular posts from this blog

Cricket vs Formers???

పవన్-త్రివిక్రమ్‌ల సినిమా ఆ విధంగా అందరికీ షాక్ ఇచ్చింది!

దర్శకుడికి అతిథి...!!!