సంక్రాంతి బరిలో ముగ్గురు తమిళ స్టార్లు




తెలుగు సినీ రంగంలో సంక్రాంతి సీజన్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ సీజన్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాది కూడా భారీ సినిమాలు రిలీజ్ కోసం క్యూ కడుతున్నాయి. పవన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాతో పాటు, బాలకృష్ణ జై సింహా, రవితేజ టచ్ చేసి చూడు సినిమాలో సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతున్నాయి. ఇంతటి భారీ పోటి ఉన్నా.. తమిళ తంబిలు అదే సీజన్ లో డబ్బింగ్ సినిమాలతో రెడీ అవుతున్నారు.
తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తుంటారు. అదే బాటలో ఈ సంక్రాంతి సీజన్ లో ముగ్గురు తమిళ హీరోలు తమ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. విశాల్ అభిమన్యుడుతో పాటు సూర్య హీరోగా తెరకెక్కుతున్న తానా సేద్రం కూటం, విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న స్కెచ్ సినిమాలో సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఇన్ని సినిమాలకు థియేటర్లు ఎలా సర్థుతారో చూడాలి.

Comments

Popular posts from this blog

Cricket vs Formers???

పవన్-త్రివిక్రమ్‌ల సినిమా ఆ విధంగా అందరికీ షాక్ ఇచ్చింది!

దర్శకుడికి అతిథి...!!!