రాజమౌళి కొత్త కథ అన్వేషణలో పడ్డాడు!
కనీవినీ ఎరుగని రీతిలో ‘బాహుబలి పార్ట్-2’ గ్రాండ్ సక్సెస్ సాధించడంతో రాజమౌళి ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో బాహుబలి పార్ట్-2 హడావుడి మొత్తం ముగియడంతో త్వరలో కొన్నాళ్ల సేద తీరేందుకు రాజమౌళి విదేశాలకు వెళ్లనున్నారు. అయితే ఈ లోపు తన తదుపరి చిత్రానికి సంబంధించిన కథ విషయమే తండ్రి విజయేంద్రప్రసాద్‌తో రాజమౌళి చర్చలు మొదలుపెట్టేశారు. తన తండ్రి దగ్గర ఉన్న కథల బ్యాంక్‌లోంచి కొన్ని కథలు రాజమౌళి ప్రస్తుతం రోజు వింటున్నారట. వీటిల్లో తనకు నచ్చిన కథను హాలిడే ట్రిప్‌కు ముందు ఫైనల్ చేసి.. ఆ కథకు తనకు ఎలా కావాలో రాజమౌళి కీలకమైన ఇన్‌పుట్స్ ఇచ్చి వెళతారట. రాజమౌళి హాలిడే ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన తన సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. రాజమౌళి తదుపరి చిత్రంలో కథానాయకుడిగా ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా సస్పెన్స్ వీడలేదు!
మరిన్ని టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ కథనాలకై ఈ క్రింద లింక్ ను క్లిక్ చేయండి

Comments
Post a Comment