త్వరలో రాజమౌళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే సినిమా ఏంటో చెప్పేసాడు..!
సోషల్ మీడియాలో తనకు నచ్చిన సినిమాలపై ప్రశంసలు కురిపించే స్టార్ డైరెక్టర్ రాజమౌళి, నాని హీరోగా కొత్త దర్శకుడుశివ నిర్వాణ తెరకెక్కించిన నిన్ను కోరి సినిమా టీజర్ ను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసి ఈ సినిమాను తొలిరోజు ఫస్ట్ షో చూడాలనుందంటూ కామెంట్ చేశాడు. నాని తన కెరీర్ లోనే టాప్ ఫాంలో ఉన్నాడంటూ కితాబిచ్చాడు రాజమౌళి.
రాజమౌళి ట్వీట్ పై స్పందించిన హీరో నాని..’సార్ నాకు సినిమా సగం హిట్ అయిపోయినట్టే అనిపిస్తుంది.థాంక్యూ సోమచ్.. ఫస్ట్ డే ఫస్ట్ షోలో కలుద్దాం..’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇటీవల నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాలో కొన్నిసెకన్ల పాటు తెర మీద కనిపించాడు రాజమౌళి. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో ఈగ సీక్వల్ కూడా సెట్స్ మీదకువెళ్లనుందన్న ప్రచారం జరుగుతోంది.
మర్రిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ కై ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
Comments
Post a Comment