Posts

Showing posts from June, 2017

Cricket vs Formers???

Image
*వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశ భక్తులారా.... ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా.... ఒక్కసారి ఆలోచించండి...* దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ పట్టించుకుంటున్నావా....... 🍅 🍅 🍅 ఇష్టమయిన క్రికేటరెవరో వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు నీకు తెలిసిన రైతు ఎవరైనా వంద బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా..... 🍏 🍏 🍏 రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే.... నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?.... 🌽 🌽 🌽 దేశాన్ని గెలిపించడానికి కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే, టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్... దేశాన్ని బతికించే నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్ అనే ఆందోళన నీకుందా ?... 🌶 🌶 🌶 నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్ నిన్ను బతికించే రైతులకెవరూ ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా.... ��� నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా...... 🍆 🍆 🍆 అన్నం తింటూ కూడా .. పాకిస్తానీ టీం న

త్వరలో రాజమౌళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే సినిమా ఏంటో చెప్పేసాడు..!

Image
సోషల్   మీడియాలో   తనకు   నచ్చిన   సినిమాలపై   ప్రశంసలు   కురిపించే   స్టార్   డైరెక్టర్   రాజమౌళి ,  నాని   హీరోగా   కొత్త   దర్శకుడు శివ   నిర్వాణ   తెరకెక్కించిన   నిన్ను   కోరి   సినిమా   టీజర్   ను   తన   సోషల్   మీడియా   పేజ్   లో   పోస్ట్   చేసి   ఈ   సినిమాను   తొలి రోజు   ఫస్ట్   షో   చూడాలనుందంటూ   కామెంట్   చేశాడు .  నాని   తన   కెరీర్   లోనే   టాప్   ఫాంలో   ఉన్నాడంటూ కితాబిచ్చాడు రాజమౌళి . రాజమౌళి   ట్వీట్   పై   స్పందించిన   హీరో   నాని ..’ సార్   నాకు   సినిమా   సగం   హిట్   అయిపోయినట్టే   అనిపిస్తుంది . థాంక్యూ   సో మచ్ ..  ఫస్ట్   డే   ఫస్ట్   షోలో   కలుద్దాం ..’  అంటూ   రిప్లై   ఇచ్చాడు .  ఇటీవల   నాని   హీరోగా   తెరకెక్కిన   మజ్ను   సినిమాలో   కొన్ని సెకన్ల   పాటు   తెర   మీద   కనిపించాడు   రాజమౌళి .  త్వరలో   వీరిద్దరి   కాంబినేషన్   లో   ఈగ   సీక్వల్   కూడా   సెట్స్   మీదకు వెళ్లనుందన్న   ప్రచారం   జరుగుతోంది . మర్రిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ కై ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి        http://telugu.tfcmedia.in

చావైనా బ్రతుకైనా నీతోనే అంటున్న నాని

Image
నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా నిన్ను కోరి . ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్‑ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. చావైనా బ్రతుకైనా నీతోనే అని నాని ఎమోషనల్ గా నివేదా థామస్ కి చెప్పాడు. ట్రైలర్ ని చూసి మరో హిట్ గ్యారంటీ అంటున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్‑గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలో రిలీజ్‑కు రెడీ అవుతున్న ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్‑ను  రిలీజ్ ఈరోజు చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 7న రిలీజ్ అవుతోంది.

అప్పుడే కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న ముద్దుగుమ్మ!

Image
‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్‌కు అరంగేట్రం చేసిన పూజా హెగ్డే  ఆ తర్వాత నాగచైతన్య సరసస ‘ ఒక లైలా కోసం ’ లో కూడా నటించింది. అయితే, ఈ రెండు సినిమాలు ఆమె టాలీవుడ్‌లో బ్రేక్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏకంగా హృతిక్ రోషన్ సరసన ‘మొహంజోదారో’ సినిమాలో అవకాశం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ లో ఆమెకు ఆశించిన అవకాశాలు రాలేదు. మళ్లీ ఇప్పుడు  టాలీవుడ్ పై దృష్టి పెట్టి  దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తోంది. ఈ సినిమా హిట్ అవుతుందనే వార్తలు వస్తుండటంతో.. పూజా హెగ్డే కు టాలీవుడ్‌ చాలా మంది అగ్ర నిర్మాతలు సంప్రదిస్తున్నారు. దీంతో ఈ డిమాండ్ ను క్యాష్‌ చేసుకునేందుకు ఆమె ఒక్కసారిగా తన పారితోషకాన్ని పెంచేసిందట. నిన్న మొన్నటి దాకా ముఫ్పై- నలభై లక్షల రేంజ్ లో ఉన్న ఈ భామ ఇప్పుడు తన రేటు కోటి చెబుతుందట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పూజా హెగ్డేను సంప్రదించగా ఆమె కోటి రూపాయలు అడిగాడట. ఆమె అడిగినంత ఇవ్వడానికి బెల్లంకొండ సురేష్ సిద్ధపడ్డాడని చెప్పుకుంటున్నారు.