Posts

Showing posts from November, 2017

Funny dance By Small Kid...

Image

సంక్రాంతి బరిలో ముగ్గురు తమిళ స్టార్లు

Image
తెలుగు సినీ రంగంలో సంక్రాంతి సీజన్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ సీజన్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాది కూడా భారీ సినిమాలు రిలీజ్ కోసం క్యూ కడుతున్నాయి. పవన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాతో పాటు, బాలకృష్ణ జై సింహా, రవితేజ టచ్ చేసి చూడు సినిమాలో సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతున్నాయి. ఇంతటి భారీ పోటి ఉన్నా.. తమిళ తంబిలు అదే సీజన్ లో డబ్బింగ్ సినిమాలతో రెడీ అవుతున్నారు. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తుంటారు. అదే బాటలో ఈ సంక్రాంతి సీజన్ లో ముగ్గురు తమిళ హీరోలు తమ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. విశాల్ అభిమన్యుడుతో పాటు సూర్య హీరోగా తెరకెక్కుతున్న తానా సేద్రం కూటం, విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న స్కెచ్ సినిమాలో సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఇన్ని సినిమాలకు థియేటర్లు ఎలా సర్థుతారో చూడాలి.

ప్రజా సంకల్పం పాదయాత్ర Day – 5 సమగ్ర సమాచారం..

Image
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల సమీపంలోని బస నుంచి ఐదోరోజు పాదయాత్ర ప్రారంభిచాడు. ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభం కాగా , జగన్‌తో కలిసి వందల సంఖ్యలో యువత అడుగు కలిపింది. రాజన్న రాజ్యం.. జగనన్న లక్ష్యం అంటూ యువత పాదయాత్రలో పాల్గొంది. వైఎస్‌ జగన్‌ను చూసేందుకు, అభిమానులు పోటీపడ్డారు . అందరినీ పలకరిస్తూ.. క్షేమ సమాచారాలు ఆరా తీస్తూ.. వైఎస్‌ జగన్‌ ముందుకు సాగాడు . పాదయాత్ర సందర్భంగా రోడ్డుకిరువైపులా జనాలు జగన్‌ కోసం ఎదరు చూస్తూ నిలబడ్డారు. ఎర్రగుంట్ల నుంచి బయలుదేరి పదకొండు గంటలకు పోట్లదుర్తి గ్రామానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌కు ప్రజలు, అభిమానులు, ఘనస్వాగతం పలికారు. పోట్లదుర్తి చేరుకున్న తరువాత వైఎస్‌ జగన్‌ అక్కడే పార్టీ జెండాను అవిష్కరించాడు. ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను వాల్మీకి బోయలు పోట్లదుర్తిలో కలిసి తమ ఆవేదనను ఆయనకు చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు ద్రోహం చేస్తున్నాడని.. మీరే న్యాయం చేయాలంటూ వైఎస్‌ జగన్‌ను వేడుకున్నారు.